KME: జుక్కల్‌లో రేపు నియోజకవర్గ స్థాయి బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి అర్చన ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పోటీల్లో గెలిచిన విజేతలకు రూ.51 వేలు, రూ.25 వేలు, రూ.11 వేల నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
జుక్కల్‌లో రేపు బతుకమ్మ సంబరాలు


