హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం

NTR: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ బైపాస్‌ రోడ్డులో కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.