హైదరాబాద్: 28°C
వార్తలు

ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం

JGL: ఆబ్కారీ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు రేపు ఉదయం 9 గంటలకు మెట్‌పల్లిలో బహిరంగ వేలం వేస్తామని మద్యపాన నిషేధ శాఖ అధికారులు తెలిపారు. షైన్, ప్యాషన్ ప్రో, టీవీఎస్ ఎక్స్‌ఎల్ తదితర వాహనాలను రవాణా శాఖ నిర్ణయించిన ధరల ఆధారంగా వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు.