కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని ప్రభుత్వం జనరల్ కేటగిరీకి కేటాయిస్తూ సోమవారం గెజిట్ విడుదల చేసింది. దీంతో అక్కడ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం బీసీ మహిళకు దక్కుతుందని సోషల్ మీడియాతో పాటు పత్రికల్లోనూ వచ్చిన అంచనాలు తలకిందులయ్యాయి. జనరల్ విభాగంగా తేలడంతో అమలాపురం బరిలో పోటీ రసవత్తరంగా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపల్ కుర్చీ జనరల్‌కి కేటాయింపు


