హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ బీజేపీ ధర్నా

కోనసీమ: రాహుల్ గాంధీ మహిళల పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ అమలాపురం గడియార స్తంభం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. మహిళలను అవమానించడం సరికాదని నాయకులు అన్నారు. కాంగ్రెస్, ఇండి కూటమి ఆందోళనలు అర్థరహితమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ విమర్శించారు. పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.