హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురం ఆర్టీసీ డిపోలో హెవీ డ్రైవింగ్ శిక్షణ

కోనసీమ: ఏపీఎస్ ఆర్టీసీ అమలాపురం డిపోలో త్వరలో 13వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. 21 ఏళ్లు నిండి, లైట్ వెహికల్ లైసెన్స్‌తో పాటు ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ కె.ఎస్. రావును 94407 72183 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.