హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిపోయిన చిన్నారి.. తల్లికి అప్పగింత

NTR: విజయవాడ దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చిన కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన చిన్నారి తనుశ్రీ క్యూ లైన్‌లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. అప్రమత్తమైన పోలీసులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి వివరాలు సేకరించారు. 20 నిమిషాల్లోనే చిన్నారిని గుర్తించి తల్లికి క్షేమంగా అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.