హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షిలో గాయత్రి దేవిగా దుర్గాదేవి దర్శనం

సత్యసాయి: లేపాక్షి శ్రీ దుర్గాదేవి ఆలయంలో దసరా నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.