హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త బస్టాండ్ నిర్మించాలని వినతి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలో కొత్త బస్టాండ్ నిర్మించాలని TGSRTC ఎండీ నాగిరెడ్డిని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బస్ భవన్‌లో ఆయనను కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. కాగజ్‌నగర్ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని, దాని స్థానంలో కొత్త బస్టాండ్‌తో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని కోరారు.