హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయం

JGL: మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్ అనారోగ్యంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.