BPT: బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 52 మంది బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. కుటుంబ, భూ వివాదాలు, ఆర్థిక మోసాలపై వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక


