బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వెనుక రూ.60 లక్షల నిధులతో నిర్మించిన 'సఖీ వన్ స్టాప్ సెంటర్' భవనాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు వైద్యం, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, ఆశ్రయం ఒకే చోట అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. మహిళా భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, బాధితులకు అధికారులు అండగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో 'సఖీ' భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే


