ఉప్పల్ స్టేడియంలో ఈనెల 14న జరగనున్న IND-WI 4వ టీ20కు ఏర్పాట్లు పూర్తయ్యాయని మల్కాజ్‌గిరి సీపీ సుమతి తెలిపారు. 2,200 మంది పోలీసులతో బందోబస్తు, 408 సీసీ కెమెరాలు, 2 డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫేక్ టికెట్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సుమారు 40 వేల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. RTC, మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
క్రీడలు
నాలుగో టీ20కి సిద్ధమైన హైదరాబాద్


