హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ వీడియోలు చూసి నేర్చుకున్నా: ఆసీస్ బ్యాటర్

IND-Aతో జరిగిన వన్డే సిరీస్‌లో AUS-A బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ.. కోహ్లీ, స్టీవ్ స్మిత్‌ల యూట్యూబ్ వీడియోలు చూసి స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నట్లు తెలిపాడు. భారత స్పిన్నర్లను కోహ్లీ హ్యాండిల్ చేసే శైలిని గమనించి మైదానంలో అమలు చేశానన్నాడు. అందుకే ఈ స్థాయిలో రాణించగలిగానని పేర్కొన్నాడు.