హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాఫ్ట్‌బాల్ పోటీల్లో తోర్లికొండ విద్యార్థినులకు స్వర్ణ పతకాలు

NZB: తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరవ తరగతి విద్యార్థినులు కన్క అశ్విత, పెండ్యాల సహస్ర రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచిన వీరిని మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, సర్పంచ్ పద్మ నాగరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు.