సత్యసాయి: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజల నుంచి 62 ఫిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తాం'


