ASR: 2 నెలల్లో CHWలను ఆశా వర్కర్లుగా మారుస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇవ్వడంతో సోమవారం పాడేరులో CHWలు ఆందోళన విరమించారు. మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేస్తామని పీవో హామీ ఇచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హామీ అమలు చేయకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పీవో హామీతో సీహెచ్‌డబ్ల్యూల ఆందోళన విరమణ


