హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు: CPI

ADB: దేశంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ 14 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసి కార్మికులు రేవంత్ ప్రభుత్వాన్ని నమ్మకనే ఏఐటీయూసీకి విజయం అందించారని పేర్కొన్నారు.