హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీ నిరసనల్లో ఎమ్మెల్యే విజయరమణారావు

PDPL: సీఈసీ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. ఢిల్లీలోని బరాఖంబ మెట్రో స్టేషన్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.