హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువుల ధరలు తగ్గించాలని వినతి

ELR: లింగపాలెం మండలం రంగాపురంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. యాప్ ద్వారా ఎరువుల విక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని, సరిపడా ఎరువులు అందించాలని, పెంచిన ధరలు తగ్గించాలని కోరుతూ వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకుడు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.