హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీ సర్వేకు బృందాల ఏర్పాటు: అదనపు కలెక్టర్

ASF: భూముల రీ సర్వేకు ప్రతి మండలంలో 2 బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. సోమవారం CCLA లోకేశ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 13 రోవర్లు అందుబాటులో ఉన్నాయని, రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం, 22ఏ నిషేధిత భూముల సమస్యలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.