హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ

ATP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తెలిపారు. యువతకు ఆయన సేవలను, స్ఫూర్తిని చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, పాఠకులు ఈ పుస్తకాన్ని చదివి స్ఫూర్తి పొందాలని కోరారు.