ATP: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి RWS అధికారులను ఆదేశించారు. జేసీ స్వగృహంలో నిర్వహించిన సమీక్షలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గండికోట నీరు అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ట్యాంకులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి సమస్య నివారణకు ముందస్తు ప్రణాళిక'


