హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తి రోడ్డును త్వరగా పూర్తి చేయాలి: BJP

HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి నుంచి బట్టుపల్లి వరకు నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డును త్వరగా పూర్తి చేయాలని బీజేపీ నాయకులు తహసీల్దార్‌, ఎంపీడీవోలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎల్లమ్మ చెరువు కట్టపై బతుకమ్మ ఆడే ప్రదేశంలో కంకర తొలగించి, తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై ఎంపీడీవో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.