హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం'

VZM: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సోమవారం సమాచార హక్కు చట్టం-2005 దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐపీఆర్‌వో గోవిందరాజులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల హక్కు అని, పారదర్శక పాలనకు మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని పొందే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.