హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరుపేదలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం'

E.G: నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలబడి వైసీపీ పోరాటం చేస్తుందని రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ వెల్లడించారు. సోమవారం రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆయన ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.