హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి జిల్లా మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

కృష్ణా: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉయ్యూరు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవిని ఎస్సీ జనరల్‌కు, గుడివాడను బీసీ మహిళకు, తిరువూరును బీసీ జనరల్‌కు, పెడనను మహిళా జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. ఈ రిజర్వేషన్లతో పోటీ చేయాలనుకునే ఆశావహులు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టనున్నారు.