హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాణిపేటలో పశు ఆరోగ్య శిబిరం

MBNR: రాణిపేట గ్రామపంచాయతీలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ శివరాజ్ పశు ఆరోగ్య, గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరం నిర్వహించారు. పశువుల పోషణ, వ్యాధుల నివారణ, పాల ఉత్పత్తి పెంపుపై రైతులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ మాధవి మల్లేష్, ఉప సర్పంచ్ పర్వీన్, వార్డు సభ్యులు శ్రీకాంత్, మసూద్, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.