హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ అప్రమత్తంగా ఉండండి: సీఐ కమలాకర్

MBNR: జడ్చర్ల దసరా సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కమలాకర్ సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని కోరారు. బస్సులు, బస్టాండ్లలో సామగ్రిపై నిఘా ఉంచాలని, సమాచారం అందిస్తే రాత్రివేళ ఇళ్లపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు.