హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుక్కరాయసముద్రం చెరువులో చేప పిల్లలు విడుదల

ATP: బుక్కరాయసముద్రం చెరువులో సోమవారం 1,47,000 చేప పిల్లలను విడుదల చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రెండో విడతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాల ద్వారా సహాయం అందిస్తోందని వారు తెలిపారు.