హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు

ASR: అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బాలాపం పంచాయితీ పరిధిలో గిల్లలుబంద గ్రామంలో మట్టి రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులని పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డుకి మరమ్మతులు చేయాలని అధికారులని వారిని కోరుతున్నారు.