ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఈ నెల 14, 15 తేదీల్లో జీపీఎఫ్, పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు శ్రీసత్యసాయి జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారి జి. నాగరాజారావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. పెన్షనర్లు ఆధార పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'14, 15 తేదీల్లో జీపీఎఫ్, పెన్షన్ అదాలత్'


