కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పరిధి కానూరులో భర్త బతికుండగానే వితంతు పింఛన్ కోసం నకిలీ మరణ ధ్రువపత్రం సృష్టించిన యర్రంశెట్టి రమాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. పత్రాల తయారీకి రూ.15 వేలు తీసుకుని సహకరించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆంటోనీనీ అరెస్టు చేశారు. భర్త మురళీకృష్ణకు విషయం తెలియడంతో మోసం బయటపడింది. ఇద్దరినీ కోర్టు రిమాండ్‌కు పంపింది.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ కోసం ఫేక్ డెత్ సర్టిఫికెట్


