హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జల జీవన్ మిషన్' పైప్ లైన్ పనుల్లో అక్రమ వసూళ్లు

SKLM: నరసన్నపేట పట్టణంలోని వీరనాయుడు కాలనీలో జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల్లో కార్మికులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బులు ఇవ్వని ఇళ్ల వద్ద పైపులను ధ్వంసం చేస్తున్నారని, పైపులకు రంధ్రాలు చేస్తున్నారని నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.