హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు!

W.G: తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-19 ద్వారా నవంబర్ 6లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.