హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు 10 వేల పండ్ల మొక్కలు పంపిణీ

ASR: కొయ్యూరు మండలంలోని గోపవరం రైతులకు సోమవారం విశాఖ పోర్టు సహకారంతో ఉద్యాన ఉత్పత్తిదారుల రైతు సంఘం ఆధ్వర్యంలో 10 వేల పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. కొబ్బరి, మామిడి, జీడి, సపోటా, నిమ్మ, అవకాడో తదితర మొక్కలను అందిస్తున్నట్లు సంఘం సీఈఓ వెంకటరమణ, అధ్యక్షుడు మాకిరెడ్డి వరహాలుబాబు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.