హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపవరంలో ట్రాక్టర్ బోల్తా

BPT: కర్లపాలెం మండలం గణపవరంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కోళ్ల ఫారం వద్ద మలుపు తిరుగుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.