కోనసీమ: బీసీల రాజకీయ సాధికారత, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. బీసీలంతా ఐకమత్యంతో ఉండి, కూటమి నిర్ణయాలకు కట్టుబడి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల అభ్యున్నతే కూటమి లక్ష్యం: మంత్రి


