హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మామిడి రైతులను ఆదుకోవాలని వినతి

CTR: జిల్లాలో మామిడి రైతులకు న్యాయం చేయాలని మామిడి సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సబ్సిడీ నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని వారు కోరారు. మామిడికాయలు తరలించి నెలలు కావస్తున్న ఇంతవరకు సబ్సిడీ నగదు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కరువులో మామిడి రైతుకు అండగా ఉండాలన్నారు.