హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్స్య ఫెడరేషన్‌కు ఎన్నికలు జరపాలి

NGKL: తెలంగాణ మత్స్య సహకార ఫెడరేషన్‌లో 33 జిల్లాలకు సభ్యత్వాలు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌సీఎస్ చైర్మన్ వాకిటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. 2024లోనే డీడీతో తీర్మానం ఇచ్చినా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఇన్‌చార్జిని నియమించి ఎన్నికలు జరపాలని, లేకుంటే మత్స్యకారులతో కలిసి పోరాడతామని హెచ్చరించారు.