హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ మేయర్ పీఠం.. బీసీ మహిళకు ఛాన్స్!

KKD: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేయర్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17 స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. ఇందులో భాగంగా కాకినాడ మేయర్‌ స్థానాన్ని బీసీ మహిళా కేటగిరీకి కేటాయించారు. దీంతో మహిళకు ఛాన్స్ దక్కడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.