హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలకు బహుమతులు

NLR: కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 'బాలికలను కననివ్వండి-బాలికలను బతకనివ్వండి' అనే సామాజిక అవగాహన అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి షార్ట్ ఫిల్మ్స్‌కు బహుమతులు లభించాయి. సోమవారం నెల్లూరు జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ సుజాత విద్యార్థులను అభినందించారు.