హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం మేయర్ రేసులో కొనకళ్ల గౌతమి?

కృష్ణా: మచిలీపట్నం మేయర్ పదవిపై రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తొలుత ఓసీకి రిజర్వ్ అవుతుందని, జనసేన నుంచి బండి రామకృష్ణకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. తాజాగా బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పెద్ద కోడలు కొనకళ్ల గౌతమి పేరు తెరపైకి వచ్చింది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.