హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ మేళా

ELR: ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఏపీ ట్రైకార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న కొయ్యలగూడెంలోని ప్రకాశం డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 కంపెనీలు పాల్గొని 1,500 మందికి ఉపాధి కల్పించనున్నాయి. పదో తరగతి నుంచి పీజీ, బీటెక్ వరకు అర్హతలున్న 18–35 ఏళ్ల అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్ల నకళ్లతో హాజరుకావాలని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు కోరారు.