హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఇక చిరుధాన్యాల చిక్కీలు!

KDP: విద్యార్థుల్లో పోషకాహార లోపాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సోమ, బుధ, శుక్రవారాల్లో చిరుధాన్యాల చిక్కీలు పంపిణీ చేస్తోంది. గతంలో వేరుశెనగ చిక్కీలను మాత్రమే అందించేవారు. కడప జిల్లాలోని 3,043 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.08 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.