హైదరాబాద్: 28°C
తెలంగాణ

సజావుగా ఓపెన్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు

MNCL: మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షలకు పదవ తరగతిలో మొత్తం 50 మంది విద్యార్థులకు గాను 30 మంది, ఇంటర్ లో మొత్తం 66 మంది విద్యార్థులకు గాను 46 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను డీఈఓ చంద్రయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సందర్శించి తనిఖీ చేశారు.