హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు 20 గంటల విద్యుత్‌ ఇవ్వాలని వినతి

NGKL: రైతులకు రోజుకు కనీసం 20 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు చందులాల్‌ చౌహాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అచ్చంపేట ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్‌ కోతల కారణంగా పత్తి, వేరుశనగ, వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.