హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

ASR: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా సోమవారం చింతపల్లిలో జీఎంఎస్‌కేలు, వాసవ్య మహిళా మండలి మహిళా శిక్షకులతో సీఐ బీ. సింహాచలం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలకు సందేశం ఇచ్చేలా ర్యాలీ నిర్వహించారు. మహిళల రక్షణ, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.