KDP: పెన్నానదిలో జేసీబీలతో ఇసుక తవ్వితే కేసులు నమోదు చేసి యంత్రాలను సీజ్ చేస్తామని సిద్ధవటం తహసీల్దార్ విజయకుమార్ హెచ్చరించారు. ఇసుకను గృహ అవసరాలకే వినియోగించాలని, కూలీలతోనే లోడింగ్ చేయించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆకస్మిక దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ వార్నింగ్


