హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మార్వో కార్యాలయంలో ఉచిత హోమియో వైద్య శిబిరం

BPT: కారంచేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, స్వర్ణ ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.